ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరకట్ట విషయంలో సీఆర్డీఏకు హైకోర్టులో చుక్కెదురు - NTR JAYANTI

సీఆర్డీఏ తనకు జారీ చేసిన షోకాజ్ నోటిసులపై అభ్యంతరాలు లేవనెత్తిన ఓ వ్యక్తి వాదనలను హైకోర్టు సమర్థించింది.

హైకోర్టు

By

Published : Jul 30, 2019, 4:29 AM IST

Updated : Jul 30, 2019, 12:03 PM IST

కృష్ణానదికి 100 మీటర్లలోపు భవన నిర్మాణాలకు తావులేదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని కేదారిష్ అనే ఓ ఇంటి యజమానికి సీఆర్డీఏ అధికారులు సంజాయిషీ నోటీసు ఇచ్చారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేదారిష్ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ నోటీసు అమలును 3 వారాలు నిలుపుదల చేస్తూ సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఆర్డీఏ కమిషనర్ అప్పీల్ దాఖలు చేశారు. దానిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.... తీర్పు వాయిదా వేసింది. సోమవారం నిర్ణయాన్ని వెల్లడించింది. షోకాజ్​పై కేదారిష్ లేవనెత్తిన ఆభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులు జారీచేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. అప్పటి వరకు ఆయనకు చెందిన భవనం విషయంలో యధాతథ స్థితి (స్టేటస్కో)కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది

Last Updated : Jul 30, 2019, 12:03 PM IST

For All Latest Updates

TAGGED:

NTR JAYANTI

ABOUT THE AUTHOR

...view details