.
రాజధాని ప్రతిపాదనకు నిరసనగా... జగ్గయ్యపేటలో ఐకాస భారీ ఆందోళన - రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా జగ్గయ్యపేటలో ఆందోళనలు
అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ... కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఐకాస భారీ ఆందోళన చేపట్టింది. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. నిరసన దీక్షా శిబిరం వద్ద నినాదాలతో సభ నిర్వహించారు. మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సహా కాంగ్రెస్, సీపీఐ, జనసేన పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా... జగ్గయ్యపేటలో ఐకాస భారీ ఆందోళన