కృష్ణాజిల్లా నందిగామ డీవీఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను తొలగించి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా నేతలు రాస్తారోకో నిర్వహించారు.
తెదేపా దిమ్మె తొలగింపుపై ఆందోళన - వైకాపా
నందిగామలో తెలుగు దేశం పార్టీ దిమ్మెను తొలగించి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న వైకాపా నాయకులపై తెదేపా నేతలు మండిపడ్డారు. తిరిగి విగ్రహం ఏర్పాటు చేయాలని ధర్నా చేశారు.
తెదేపా
విషయం తెలుసుకున్న నందిగామ సీఐ కనకారావు సంఘటనా స్థలానికి చేరుకొని వైకాపా నాయకులతో మాట్లాడారు. తెదేపాజండా దిమ్మెను యధావిధిగా ఏర్పాటు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి:20 రోజుల్లోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా?: ఎంపీ రామ్మోహన్