కొబ్బరి చెట్టు ఎక్కాలనుకున్నాడు..అంతలోనే విషాదం - కృష్ణా జిల్లా
అత్తవారింటికి వచ్చాడు... కుటుంబ సభ్యులతో ఆనందగా గడపాలనుకున్నాడు. కానీ ఇంతలోనే విధి తనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది.
మృతి చెందిన వ్యక్తి
కృష్ణాజిల్లా కైకలూరు మండలం రాచపట్నం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అత్తవారింటికి వచ్చిన అల్లుడు కట్టా సురేష్ కొబ్బరి చెట్టు చెట్టు ఎక్కే క్రమంలో కరెంటు తీగ తగిలి మృత్యువాత పడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆనందంగా గడిపేందుకు వచ్చిన అల్లుడు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.