ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు తెగి వరద నీరు ఇళ్లలోకి ప్రవహిస్తోంది. కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం ఉత్తర చిరువోలు లంక పక్కన కరకట్ట లాకుల ద్వారా వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో కోసురువారిపాలెం, మెళ్ళమర్తిలంక , ఉత్తర చిరువోలు లంక గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
లంక గ్రామాలకు ముంపు... - కృష్ణాజిల్లా లంక గ్రామాలకు ముంపు
వరద నీరు ఉద్ధృతంగా గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. మరో వైపు వందల ఎకరాల్లో పంటలు పూర్తీగా నీట మునిగాయి.

లంక గ్రామాలకు ముంపు.
వేల క్యూసెక్యుల వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకు వస్తుంది. వందల ఎకరాలు నీట మునిగాయి. అధికారులు చర్యలు తీసుకోకపోవడం, లాకు కిందకి దిగక పోవడంతో నదిలోని వరద గ్రామాల్లోకి వస్తుందని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండీ...ఒడ్డుకు వచ్చిన బంగ్లా నౌకను సముద్రంలోకి పంపడం ఎలా!