కృష్ణా జిల్లాలో జులై ఆఖరు నాటికి కరోనా కేసుల సంఖ్య 17,288 చేరింది. అదే సమయానికి 1,98,635 మందికి పరీక్షలు చేయగా 8.74 శాతం మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మొత్తం 187మంది మృత్యువాత పడగా జులైలోనే మూడొంతులకు పైగా మరణాలు సంభవించాయి. ఆ నెలలో అత్యధికంగా 162 మంది చనిపోయారు. 91.26శాతం మందికి అసలు వ్యాధి నిర్ధారణ కాలేదు. అయినా వారిని అనుమానితులుగా యంత్రాంగం గుర్తించి వైద్య పరీక్షలు చేయించింది.
8.74 శాతం మందికే పాజిటివ్ - corona in krishna district
కృష్ణా జిల్లాలో 1,98,635 మందికి పరీక్షలు చేయగా 8.74 శాతం మందికి వైరస్ సోకినట్లు వెల్లడైంది. జిల్లాలో 187 మంది మృతి చెందాగా.. జులైలోనే మూడొంతులకు పైగా మరణించారు.
జిల్లాలో కరోనా బాధితులకు ప్రభుత్వ-ప్రైవేటులో కలిపి మొత్తంగా 15 ఆసుపత్రుల్లో, అలాగే మరో మూడు కొవిడ్ కేర్ కేంద్రాల్లోనూ వైద్య సేవలు అందుతున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ నాటికి జిల్లాలోని 15 ఆసుపత్రుల్లో కలిపి 1961 మంది నాన్ ఐసీయూ పడకల్లో, 942 మంది ఆక్సిజన్‌తో కూడిన నాన్ ఐసీయూల్లో, 390 మంది ఐసీయూ వార్డుల్లో, 151 మంది వెంటిలేటర్లపై వైద్యసేవలు పొందుతున్నారు. గుంటూరు నగరానికి సమీపంలోని అడవితక్కెళ్లపాడు, చిలకలూరిపేటలోని టిడ్కో గృహాలు, గుండిమెడలోని కొవిడ్ కేర్ సెంటర్లలో 1051 పడకలు ఉండగా 951 మందికి అడ్మిషన్ కల్పించి వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా గుంటూరు నగరంలో కేసులు వెలుగుచూడగా ఆ తర్వాత నరసరావుపేట, తాడేపల్లి కేంద్రాల్లో వచ్చాయి.
ఇదీ చదవండి: హఠాత్తుగా ఆపద.. కొవిడ్ రోగుల హఠాన్మరణం