ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం - పెనుగంచిప్రోలు వద్ద ప్రమాదం బాలుడు మృతి

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్​ను కారు ఢీకొన్న ఘటనలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two years boy died in an accident
రెండేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం

By

Published : Jan 24, 2021, 11:04 PM IST

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు వద్ద ఎదురుగా వస్తున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. జగ్గయ్యపేట పట్టణం చెరువు బజారుకు చెందిన కుంచపు యోగానంద లక్ష్మీ నరసింహ, చాందిని దంపతులు వారి రెండేళ్ల కుమారుడు శివతేజతో కలిసి స్కూటీపై మధిర వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బాలుడు శివతేజ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన అతడి తల్లిదండ్రులను 108 వాహనంలో జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:వెనుక నుంచి లారీని ఢీకొని.. వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details