కృష్ణా జిల్లా గుడివాడలో కరోనా నియంత్రణకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్తో పాటు కేంద్ర కొవిడ్ నియంత్రణ కమిటీ సభ్యుడు డాక్టర్ గంగాధరరావు ప్రారంభించారు. పట్టణంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులు అందజేశారు. ప్రజలు కరోనా నియంత్రణలో సహకరించడం లేదని డాక్టర్ గంగాధర్ తెలిపారు. బయటకు వచ్చే వారు మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని వాపోయారు. వారి వల్ల కరోనా వ్యాధి విజృంభణకు కారణం అవుతుందని ఆవేదన చెందారు. అలాంటి వారిని ప్రభుత్వం శిక్షించాలంటూ అభిప్రాయాన్ని వెల్లడించారు.
గుడివాడలో పారిశుధ్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం - imu medical camp in gudivada
గుడివాడలో పారిశుద్ధ్య కార్మికులకు భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కేంద్ర కొవిడ్ నియంత్రణ కమిటీ సభ్యుడు డాక్టర్ గంగాధరరావు ప్రారంభించారు.
పారిశుధ్ధ్య కార్మికులకు వైద్య శిబిరం