ఆయుర్వేద వైద్యులకు అల్లోపతి విభాగంలో 58 రకాల శస్త్రచికిత్సలు చేయడానికి కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో వైద్యులు నిరసన తెలిపారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియో మూడు రకాల వైద్య సేవలను కలగూర గంపగా చేయాలని కేంద్రం భావిస్తోందని ఐఎంఏ అధ్యక్షులు మదుసూధన శర్మ అన్నారు. 2030నాటికి ఆధారాలు, చరిత్ర లేని కొత్త వైద్య విధానం వస్తుందని.. దీనివల్ల 130కోట్ల ప్రజల జీవితాలకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు.
డిసెంబర్ 11న వైద్యసేవలు బంద్
ఆయుర్వేద వైద్యులకు అల్లోపతి విభాగంలో 58 రకాల శస్త్రచికిత్సలు చేయడానికి కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 11న వైద్యసేవలు నిలిపివేయనున్నట్లు విజయవాడలో వైద్యులు తెలిపారు.
IMA protest against NMC bill
అందరినీ కలిపి వైద్యం చేయాలని చెప్పడం సరైన విధానం కాదని డాక్టర్ సమరం అన్నారు. ఆర్ఎంపీని శస్త్ర చికిత్స చేయమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. డిసెంబర్ 11న ఉదయం 6 నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆస్పత్రులు, క్లినిక్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని వివరించారు. తమ నిరసనకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.
ఇదీ చదవండి: కర్షక పోరుకు కృష్ణా జిల్లాలో వెల్లువెత్తుతున్న మద్దతు