ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో వైద్యుల రిలే నిరాహార దీక్ష - డాక్టర్ల నిరసన విజయవాడ

కేంద్ర ప్రభుత్వం.. ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ విజయవాడలో వైద్యులు రిలే నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ima
విజయవాడలో వైద్యుల రిలే నిరాహార దీక్ష

By

Published : Feb 10, 2021, 4:58 PM IST

ఆయుర్వేద వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతిస్తూ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వైద్యులు రిలే నిరాహార దీక్షకు దిగారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ నోటిఫికేషన్ విధివిధానాలను తెలపడానికి నీతి ఆయోగ్ నియమించిన నాలుగు కమిటీలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీసీఐఎం అనే ఆయుర్వేద నియంత్రణ సంస్థ చట్టాన్ని, తన అధికార పరిధిని అతిక్రమించి ఆయుర్వేదిక్ వైద్యులు శస్త్రచికిత్సలు చేయవచ్చని , గతేడాది నవంబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకుంటే దేశ వ్యాప్తంగా తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details