కొవిడ్ 19 ( కరోనా కొత్త పేరు) గురించి భయపడకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలని ఐఎంఏ వైద్యులు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఎవరైతే గుండెపోటు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారో వారికే త్వరగా సోకుతుందనీ, వారు మాత్రమే మరణిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నపిల్లలపై దీని ప్రభావం చాలా తక్కువుగానే ఉందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరచాలనం చేయటం, మాస్కులు ధరించటం ద్వారా వైరస్ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఆస్కారం ఉందని తెలిపారు.
వారి పైనే కరోనా ప్రభావం... అప్రమత్తంగా ఉండండి - awareness program on carona in vijayawada by ima doctors
కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ఐఎంఏ వైద్యులు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఐఎంఏ వైద్యులు మాట్లాడుతూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉంటే చాలని సూచించారు.
Breaking News