ఆయుర్వేదిక్ వేదిక్లు మోడ్రన్ సర్జరీలు చేయవచ్చని నవంబర్ 19 సీసీఐఎం ఇచ్చిన నోటిఫికేషన్ చట్ట వ్యతిరేకమంటూ ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డా.నంద కిషోర్ అన్నారు. నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 11న ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తామని.. కేవలం కొవిడ్, అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డా.నందకిషోర్ తెలిపారు.
'వేదిక్ల మోడ్రన్ సర్జరీలపై సీసీఐఎం నోటిఫికేషన్ చట్ట వ్యతిరేకం' - వేదిక్ల సర్జరీలకు వ్యతరికంగా ఐఎంఏ నిరసనలు
వేదిక్లు మోడ్రన్ సర్జరీలు చేయవచ్చని నవంబర్ 19 సీసీఐఎం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కు తీసుకోవాలని ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డా.నంద కిషోర్ డిమాండ్ చేశారు. ఈ నిర్ణయానికి నిరసనగా డిసెంబర్ 11న ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తామని అన్నారు.
ఈ నోటిఫికేషన్ ఇండియన్ మెడికల్ చట్టాలకు వ్యతిరేకమని నందకిషోర్ అన్నారు. దీనివలన భారత వైద్యులకు ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గుతాయన్నారు. మెడికల్ టూరిజం ద్వారా వచ్చే కోట్ల రూపాయల.. విదేశీ మారకద్రవ్యం పూర్తిగా పడిపోతుందని ఐఎంఏ హెచ్చరిస్తుందన్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో జూనియర్ వైద్యులు ఈనెల 2 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈనెల 8న దేశంలోని అన్ని ఐఎంఏ శాఖలు మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాయని నంద కిషోర్ అన్నారు. కేంద్రం తమ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: పేర్ని నానిపై దాడి కేసు: కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు