గోవుల శరీరంపై ఎర్రటి మచ్చలు...కళ్ల నుంచి రక్తం - కొండపల్లిలో 70 ఆవులకు అస్వస్థత
కృష్ణా జిల్లా కొండపల్లిలో గోవుల శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్ల నిండా రక్తం...స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. గోవులను పరీక్షించిన వైద్యులు...చివరకు పొంగు జబ్బుగా నిర్ధరించారు
కృష్ణా జిల్లా కొండపల్లిలో 70 ఆవులు అస్వస్థతకు గురి అయ్యాయి. వాటి శరీరంపై ఎర్రటి మచ్చలు, కళ్ల నించి రక్తం కారటంతో స్థానికులు ఆందోళన చెందారు. కరోనా వైరస్ దృష్ట్యా భయాందోళనకు గురైన స్థానికులు... వెటర్నరీ వైద్యులకు సమాచారం అందించారు. గోవులను పరీక్షించిన వైద్యులు.... పొంగు జబ్బు వచ్చిందని నిర్ధరించారు. ఇది ఒక గోవునుంచి మరో గోవుకు వ్యాపిస్తుందని తెలిపారు. గోవులకు కరోనా సోకదని డాక్టర్లు చెప్పటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్లపై తిరిగే గోవుల పట్ల యజమానులు .. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.