అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. గుడివాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బుధవారం రాత్రి గుడివాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా దాడులు నిర్వహించినట్టు చెప్పారు.
గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో 926 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్షా 32 వేలు ఉంటుందని తెలిపారు. నిందితుడు వల్లూరుపల్లి సురేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు.