ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొరియర్ మాటున అక్రమ మద్యం సరఫరా - కొరియర్ పేరిట అక్రమ మద్యం న్యూస్

కొరియర్ సర్వీస్ ద్వారా చక్కగా మద్యాన్ని ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి తీసుకువచ్చేశారా నిందితులు. చివరికి పోలీసుల తనిఖీల్లో బండారం బయటపడటంతో కటకటాల వెనక్కి వెళ్లారు.

illegal wine caught
కొరియర్ మాటున అక్రమ మద్యం సరఫరా

By

Published : Aug 22, 2020, 8:58 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యాన్ని తీసుకువచ్చేందుకు అక్రమాలకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొరియర్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు తనిఖీల్లో ఈ విషయం తాజాగా బయటపడింది. పెనమలూరు, నున్న, గన్నవరం, కృష్ణలంక ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. కృష్ణలంకలోని ఓ కొరియర్ సర్వీస్ ద్వారా ప్యాకింగ్ చేసి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సరఫరా చేస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే కొరియర్ మాటున తరలిస్తున్న 2 వేల 804 మద్యం సీసాలను ఒక లారీ, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ప్రత్యేక అధికారి సత్తిబాబు తెలిపారు. 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details