తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. పరిషత్ ఎన్నికలు పురస్కరించుకొని భారీ స్థాయిలో పక్క రాష్ట్రం నుంచి మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలోని తెలంగాణ సరిహద్దు ద్వారా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై మద్యం తరలిస్తున్నారు.
'తెలంగాణ మద్యం పట్టివేత.. నిందితుల అరెస్ట్' - illict liquor caught and cars seized by police
కృష్ణా జిల్లాలోని తెలంగాణ సరిహద్దు మార్గాల ద్వారా రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేయడంతో పాటు నిందితులను అరెస్ట్ చేశారు.
'తెలంగాణ మద్యం పట్టివేత.. నిందితుల అరెస్ట్'
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామం వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 279 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఇదే విధంగా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామం వద్ద మరో కారులో అక్రమంగా తరలిస్తున్న 150 తెలంగాణ మద్యం సీసాలను పట్టుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:గూడవల్లిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
Last Updated : Apr 5, 2021, 12:20 PM IST