ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం, నిషేధిత గుట్కా పట్టివేత - illegally stored ration rice seized at kambhapadu

కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. అక్రమంగా నిల్వ చేసిన 16 టన్నుల రేషన్ బియ్యం, నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

illegally stored ration rice seized
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం, నిషేధిత గుట్కా పట్టివేత

By

Published : Dec 15, 2020, 2:24 AM IST

కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామ శివారులో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ షెడ్డు​లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు చోట్ల చేపట్టిన తనఖీల్లో మొత్తంగా 16 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలంపల్లి గ్రామంలో సుమారు రూ.10 వేల విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లు గుర్తించారు. అక్రమాలకు పాల్పడ్డ నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details