అక్రమ మద్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఈబీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అక్రమ మద్యం రవాణా, విక్రయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సత్యనారాయణపురంలో విజయ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారమందుకున్నారు. విజయ్ నిల్వ ఉంచిన గదిలో తనిఖీలు చేసి 808 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
అక్రమ మద్యం రవాణాపై పోలీసులు నిఘా - కృష్ణా జిల్లాలో అక్రమ మద్యం రవాణా
రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణా ఎక్కువైంది. ఇతర రాష్ట్రాల నుంచి తరలిస్తున్న మద్యం భారీగా పట్టుబడుతోంది. దీంతో పోలీసులు నిఘా పెడుతున్నారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా తీసుకొచ్చిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
illegal wine transport
నగరంలో కంకిపాడు , అజిత్ సింగ్ నగర్, మాచవరం పోలీస్ స్టేషన్స్ పరిధిలో తనిఖీలు చేసి 12 మంది వ్యక్తుల నుంచి 418 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 30 వేల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కాను ఎస్ ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:'ఆశ'గా పుట్టింది.. రేవతిగా మారింది