ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 6, 2020, 5:12 PM IST

Updated : Jun 7, 2020, 1:08 PM IST

ETV Bharat / state

సౌండ్ బాక్స్, బియ్యం బస్తాలలో మద్యం తరలింపు

రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడంతో... అక్రమ తరలింపునకు తెరలేచింది. పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లా ఐతవరంలో ఓ ఆటోలో.. ఇంజిన్ బాక్స్, సౌండ్ బాక్స్, బియ్యం బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

illegal-wine-seize-in-aithavaram-krishna-district
ఐతవరంలో అక్రమ మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారిపై ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 108 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజిన్ బాక్స్, సౌండ్ బాక్స్, బియ్యం బస్తాలలో మద్యం రవాణా చేస్తున్నారని గుర్తించిన స్థానిక సీ.ఐ కనకారావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jun 7, 2020, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details