ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

400 టన్నుల ఇసుక సీజ్.. 12 మంది డ్రైవర్లు అరెస్ట్ - కృష్ణా జిల్లా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక పట్టివేత వార్తలు

కృష్ణా జిల్లా చందర్లపాడు వద్ద కృష్ణా నదిలో ఇసుక అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. 400 టన్నుల ఇసుకను సీజ్ చేసి, 12 మంది ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

illegal transport of sand is seized at chandarlapadu in krishna district
అక్రమంగా రవాణా చేస్తున్న 400టన్నుల ఇసుక సీజ్

By

Published : Nov 21, 2020, 7:50 AM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కాసరబాధ వద్ద కృష్ణా నదిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న పది ట్రాక్టర్లు , రెండు జేసీబీలను పోలిసులు పట్టుకున్నారు. 400 టన్నుల ఇసుకను సీజ్ చేసి 12 మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా నదిలో నేరుగా యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తుండగా... నందిగామ గ్రామీణ సీఐ సతీష్ దాడులు నిర్వహించారు.

కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. ఇసుక నిల్వల వద్ద కాపలాగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details