కృష్ణాజిల్లా నందిగామ నుంచి మండపేటకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో... స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడులు నిర్వహించారు. కంచికచర్ల మండలం కీసర ఇన్వెంటా కెమికల్ సమీపంలో... రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీలో సుమారు 7.5 టన్నులు గల... 170 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన బియ్యంతో పాటు లారీ డ్రైవర్ను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, కంచికచర్ల పోలీసులుకు అప్పగించగా... వారు కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న 7.5 టన్నుల రేషన్ బియ్యం సీజ్ - రేషన్ బియ్యం తరలింపు వార్తలు
కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పట్టుకున్నారు. కంచికచర్ల మండలం కీసర ఇన్వెంటా కెమికల్ సమీపంలో... లారీలో తరలిస్తున్న 7.5 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న 7.5 టన్నుల రేషన్ బియ్యం సీజ్