ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్స్​లో తరలిస్తున్న మద్యం పట్టివేత - వీరులపాడులో మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా వీరులపాడులో... అంబులెన్స్​లో తరలిస్తున్న 107 మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

illegal transport of liquor seazed and two members were arrested in veerulapadu at vijayawada
అంబులెన్స్​లో అక్రమంగా తరలిస్తున్న 107 మద్యం సీసాలు పట్టివేత

By

Published : Jun 16, 2020, 12:17 PM IST

Updated : Jun 16, 2020, 12:30 PM IST


అంబులెన్స్‌లో మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో... కృష్ణా జిల్లా వీరులపాడు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం మధిర నుంచి వస్తున్న అంబులెన్స్​ను వెంబడిస్తూ... వీరులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దాపురం చెక్‌పోస్ట్‌ వద్ద ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

అంబులెన్స్​లో 107 మద్యం సీసాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : Jun 16, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details