ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఈబీ దాడులు.. భారీగా అక్రమ మద్యం పట్టివేత

తెలంగాణ నుంచి కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పెద్దవరం గ్రామానికి.. కృష్ణా నది మీదుగా అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 650 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో అక్రమంగా తరలిస్తున్న 96 మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి భారీగా గుట్కా, సిగరెట్లు తరలిస్తున్న కంటైనర్లను.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు సీజ్ చేశారు.

illegal tranport of liquor seazed in some districts
వివిధ చోట్ల నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న మద్యం, గుట్కా స్వాధీనం

By

Published : Feb 27, 2021, 2:27 PM IST

కృష్ణా నదిపై అక్రమంగా సరఫరా చేస్తున్న 650 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి జిల్లాలోని చందర్లపాడు మండలం పెద్దవరం గ్రామానికి.. కృష్ణా నదిలో పడవ ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో.. పోలీసులు, టాస్క్​ఫోర్స్​ సిబ్బంది అక్కడకు చేరుకుని దాడులు చేశారు. ఇద్దరు వ్యక్తులను జగ్గయ్యపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురంలో కర్ణాటక మద్యం స్వాధీనం

గోవిందపురం గ్రామం క్రాస్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి.. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా.. అతని వద్ద నుంచి 96 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్​ కు తరలించారు.

భారీగా పట్టుబడిన ఖైనీ, గుట్కా

ఒడిశా నుంచి రాష్ట్రానికి.. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా రూ 24.75 లక్షల విలువైన ఖైనీ, సిగరెట్ ప్యాకెట్ బండిల్స్​లను తరలిస్తున్న భారీ కంటైనర్లను.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. భీమవరం నుంచి హౌరాకు చాపల లోడుతో వెళ్లిన కంటైనర్.. తిరిగి వస్తుండగా పచ్చిగొల్ల అప్పారావు అనే వ్యక్తి సూచన మేరకు రూ.10 వేల మొత్తానికి ఒడిశా నుంచి రాష్ట్రానికి గుట్కా, సిగరెట్ ప్యాకెట్​లను చేరవేయడానికి కంటైనర్లు అంగీకరించారు. సమాచారం అందుకున్న ఇచ్చాపురం పోలీసులు.. వాహనాల తనీఖీలు నిర్వహించారు. ఖైనీ, సిగరెట్లు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి.. 60 గుట్కా బస్తాలు.. రూ.15 లక్షల విలువ గల 20 సిగరెట్ ప్యాకెట్ల బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా.. స్వాధీనం చేసుకున్న వాటిని కమర్షియల్ టాక్స్ అధికారులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

అమరావతిలో వింతశబ్దంతో కంపించిన భూమి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details