ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పర్యవేక్షణలో ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు చురుకుగా వ్యవహరిస్తూ అక్రమదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఎస్ఐ బాషాకి అందిన సమాచారం మేరకు నందిగామ మార్కెట్ యార్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
సుబ్బయ్యగూడెం ఇసుక రీచ్ నుంచి గన్నవరం వెళుతున్న ఇసుక లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వద్ద రసీదుల్లో రాఖీ ఎవెన్యూ ప్రైవేటు లిమిటెడ్ పేరు మీద 11 టన్నులు ఉండగా... లారీలో 28 టన్నుల ఇసుక ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.