ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

15 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరిపై కేసు - నందిగామలో రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల ప్రజా పంపణీ బియ్యాన్ని నందిగామ పోలీసులు సీజ్​ చేశారు. ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.

ration rice seized at anasagaram
రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Mar 20, 2021, 7:45 PM IST

కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నందిగామ శివారు అనాసాగరం వద్ద జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్తున్న ఓ లారీలో బియ్యాన్ని గుర్తించారు. రకరకాల సంచుల్లో ఉన్న 15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. లారీని సీజ్​ చేసి.. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details