ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా కృష్ణాజిల్లా కీసర టోల్‌గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 4.15 లక్షల నగదు, సుమారు 80 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదు, బంగారాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.
ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న డబ్బు, బంగారం పట్టివేత - కృష్ణాలో ఆర్టీసీ బస్సులో అక్రమంగా డబ్బు, బంగారం తరలింపు
ఎన్నికలంటే అక్రమ డబ్బు, మద్యం, బంగారం తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు టోల్గేట్ల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. కీసర టోల్‌గేట్ వద్ద పోలీసుల తనిఖీల్లో రూ. 4.15 లక్షల నగదు, 80 గ్రాముల బంగారం పట్టుబడింది.
Illegal money and gold move in RTC bus at kisara in krishna