కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అటవీ చట్టాలను ఉల్లంఘించి అక్రమ మైనింగ్ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు.. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. జీవించే హక్కును కాలరాసే విధంగా ఈ చర్యలు సాగుతున్నాయని.. కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తెదేపా నియమించిన నిజ నిర్థరణ కమిటీ సభ్యులు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, బోండా ఉమాస కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురామ్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తంగిరాల సౌమ్య, నాగుల్ మీరాలు సంతకాలు చేసిన మూడు పేజీల లేఖను కేంద్ర మంత్రికి పంపారు.