కృష్ణా జిల్లాలో మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. విజయవాడ నగరం రెడ్ జోన్లో ఉండటం, మద్యం దొరక్కపోవటం అక్రమార్కులకు వరంగా మారింది. గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచినప్పుడు కూలీలను పెట్టి అక్రమార్కులు భారీ ఎత్తున మద్యం కొనుగోలు చేశారు. దాన్నిప్పుడు వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తూ అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
ప్రతిరోజు వందల సంఖ్యలో సీసాలు పట్టుబడుతున్నాయి. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో ద్విచక్రవాహనంలో తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.