ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్ఈబీ సోదాల్లో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత - krishna district news

తెలంగాణ నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 1,500 బాటిళ్లను స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

telanagna liquor caught by seb police
ఎస్ఈబీ సోదాల్లో తెలంగాణ 1500 బాటిళ్ల మద్యం పట్టివేత

By

Published : Jun 2, 2021, 9:02 PM IST

తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న 1,500 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా నందిగామ మండలం కొణాత్మకూరు (AP Telangana Boarder) చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీటిని ఖమ్మం నుంచి ఆంధ్రాకు.. (AP 20 AJ 2228) కారులో తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.

మధిర వైపు నుంచి వస్తున్న కారులో మద్యంతో పాటు, ముగ్గురు వ్యక్తులను ఎస్‌ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి మద్యం అమ్మిన వెంకట్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్‌ ఎస్పీ వకుల్ జిందాల్(SEB) తెలిపారు. అక్రమ మద్యం తరలింపునకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details