కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో అక్రమంగా తరలిస్తున్న 317 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. కొల్లికొల్ల శివారులో తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మద్యం బాటిళ్లను, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు.. జిల్లాలో మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు.
317 మద్యం బాటిళ్లు పట్టివేత.. నలుగురి అరెస్ట్ - liquor sized at penuganchiprolu krishna district
అక్రమంగా తరలిస్తున్న 317 మద్యం బాటిళ్లను పెనుగంచిప్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
మద్యం బాటిళ్లు పట్టివేత