కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాధారణ రవాణాను అడ్డుపెట్టుకుని... భారీగా రవాణా అవుతున్న తెలంగాణ మద్యం పట్టుకోవటం పోలీసులకు పెనుసవాల్ గా మారింది. గడిచిన 15 రోజుల్లోనే సర్కిల్ పోలీసులు 184 మందిని అదుపులోకి తీసుకొని 128 కేసులు నమోదు చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన ఖరీదైన 1900 మద్యం సీసాలను, 65 బైకులను, 17 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగేంద్ర కుమార్ తెలిపారు. సాధారణ వాహనాలు మొదలుకొని నిమ్మ, మామిడి, చేపలు వంటి లోడ్ లారీల్లో కూడా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ యాక్ట్ ద్వారా పట్టుబట్ట వాహనాలు కోర్టుకి అప్పగిస్తామని, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జాతీయ రహదారి సహా అన్ని సరిహద్దు మార్గాల్లో నిఘా పెంచి తెలంగాణ మద్యం పట్టుకుంటున్నామని పేర్కొన్నారు.
'తెలంగాణ మద్యం రాష్ట్రానికి వస్తే... సీజ్ అంతే' - krishna dst wine news
తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న మద్యాన్ని పోలీసులు ఎక్కడిక్కడ పట్టుకుంటూనే ఉన్నారు. రెండు వారాల్లో 184 మందిని అదుపులోకి తీసుకుని 1900మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగేంద్ర తెలిపారు.
!['తెలంగాణ మద్యం రాష్ట్రానికి వస్తే... సీజ్ అంతే' illegal liquor seized in krishan dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7304302-441-7304302-1590144932113.jpg)
illegal liquor seized in krishan dst