ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యాన్ని ప్రభుత్వం నియమించిన సేల్స్ మెన్స్ ఆధ్వర్యంలో అక్రమంగా విక్రయిస్తున్నారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం పెదపూడిలో ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లో మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న అబ్కారిశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 274 మద్యం సిసాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో అక్రమ దందా నిర్వహిస్తున్న ప్రభాకర్, సేల్స్ మెన్స్ నరేష్, పవన్‌లను అబ్కారిశాఖ ఆధికారులు అరెస్ట్ చేశారు.
అక్రమంగా మద్యం విక్రయం.. ముగ్గురి అరెస్ట్ - అబ్కారిశాఖ తాజా వార్తలు
కృష్ణాజిల్లా మొవ్వ మండలం పెదపూడిలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న ముగ్గుర్ని అబ్కారిశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తుండటంతో అధికారులు దాడులు నిర్వహించారు.
కృష్ణాజిల్లాలో అక్రమంగా మద్యం అమ్మకాలు