తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మీదుగా కృష్ణా జిల్లాలోకి వాహనాలపై మద్యం తరలిస్తున్న వారిని జి. కొండూరు ఎస్సై రాంబాబు పట్టుకున్నారు. సిబ్బందితో గంగినేనిపాలెం చెక్ పోస్టు, వెలగలేరు చెక్ పోస్టు, చెరువు మాధవరం ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 279 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 8 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.
19 మందిపై ఎక్సైజ్ కేసులు నమోదు చేశారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమ మద్యం దారులు మద్యాన్ని జిల్లాకు తరలించే ప్రయత్నాలను పోలీసులు మాటువేసి మరీ పట్టుకుంటున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి అక్రమ మద్యం రాకుండా కట్టడి చేస్తున్నామని తెలిపారు.