రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అక్రమ మద్యం రవాణా జోరుగా సాగుతోంది. కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న 502 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 4 ద్విచక్రవాహనాలు సీజ్ చేశారు. మొత్తం 92 వేల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందికి ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు రివార్డు అందజేశారు.
మైలవరంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత - illegal wine transfer at krishna district
కృష్ణా జిల్లా మైలవరంలో అక్రమంగా తరలిస్తున్న 502 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు.
![మైలవరంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత మైలవరంలో ఆంధ్రా తెలంగాణ సరిహద్దుల్లో అక్రమ మద్యం పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7616957-354-7616957-1592148289814.jpg)
మైలవరంలో ఆంధ్రా తెలంగాణ సరిహద్దుల్లో అక్రమ మద్యం పట్టివేత