కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబీ అధికారులు మద్యం అక్రమ రవాణాపై విస్తృత తనీఖీలు చేశారు. విజయవాడ గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 318 మద్యం బాటిళ్లను,6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు... గంపలగూడెం మండలంలో 13 మందిని, 612 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.