తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం గవాణా ఆగటం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా నిందితుల్లో మార్పు రావటంలేదు. తాజాగా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి జోరుగా అక్రమ మద్యం రవాణా - illegal liquor transport from telangana
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు అడ్డుకుంటున్నా... నిందితులు సరఫరా ఆపటం లేదు. తాజాగా కృష్ణా జిల్లా దొనబండ చెక్పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో మద్యం తరలిస్తున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా మద్యం తరలింపు
కృష్ణా జిల్లా కంచికర్ల మండలం దొనబండ పోలీస్ ఔట్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 బస్సులు, ఒక చేపల లారీలో అక్రమంగా మద్యాన్ని తరలించేందుకు ప్రయత్నించిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 454 మద్యం బాటిళ్లు, లారీ, స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులంతా తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్నారని నందిగామ సీఐ సతీష్ తెలిపారు.
ఇదీ చదవండి:నందిగామలో మంగళవారం నుంచి లాక్డౌన్..!