మద్యాన్ని రకరకాల మార్గాల్లో తరలించడానికి అక్రమదారులు ప్రయత్నిస్తున్నారు. కారు డోర్ మధ్యలో బాటిల్స్ పేర్చి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నూజివీడు డీఎస్పీ బుక్క వరపు శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ రామచంద్ర రావు సూచనల మేరకు ముసునూరు ఎస్సై రాజారెడ్డి వాహన తనీఖీలు నిర్వహించారు.
కారు డోర్, స్టీరింగ్ ముందు భాగంలో 286 మద్యం బాటిళ్లు! - కృష్ణా జిల్లాలో అక్రమంగా మద్యం పట్టివేత వార్తలు
కృష్ణా జిల్లా ముసునూరులో మద్యం అక్రమ రవాణాదారుల ఎత్తులను ఎప్పటికప్పుడు పోలీసులు చిత్తు చేస్తున్నారు. పలు మార్గాల్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుంటున్నారు. తాజాగా ఓ మెకానిక్... కారు డోర్, స్టీరింగ్ ముందు భాగంలో సూమరు 286 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
![కారు డోర్, స్టీరింగ్ ముందు భాగంలో 286 మద్యం బాటిళ్లు! కారు డోర్, స్టీరింగ్ ముందు భాగంలో 286 మద్యం బాటిళ్లు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9876730-433-9876730-1607953328400.jpg)
సర్దార్ హుస్సేన్ మెకానిక్ కారుపై అనుమానం వచ్చి పోలీసులు తనీఖీలు చేశారు. కారు డోర్ మధ్యలో, స్టీరింగ్ ముందుభాగంలో 40 వేల రూపాయల విలువ చేసే 286 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తెలంగాణ నుంచి కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు. వీటిని ముసునూరు గ్రామానికి చెందిన అనగాని రాంబాబు అనే వ్యక్తికి విక్రయించేందుకు వెళ్తునట్లు వివరించాడు. చాకచక్యంగా కారులో తరలిస్తున్న మద్యం సీసాలను పట్టుకున్న ముసునూరు ఎస్సై రాజారెడ్డిని, సిబ్బందిని అధికారులు అభినందించారు.
ఇవీ చదవండి
బైక్ను ఢీకొన్న బొలెరో...అక్కడికక్కడే వృద్ధుడు మృతి
TAGGED:
కృష్ణా జిల్లా తాజా వార్తలు