తెలంగాణ నుంచి రాష్ట్రానికి తీసుకొస్తున్న అక్రమ మద్యం పట్టివేత - తెలంగాణ నుంచి వస్తున్న మద్యం పట్టివేత వార్తలు
తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా జి కొండూరు మండలం మునాగపాడు వద్ద మద్యాన్ని పట్టుకున్నారు.

illegal liquor caught in krishna district
తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణాలో పోలీసులు పాత్ర కుడా ఉందన్న సమాచారం మేరకు వారిని కూడా విచారిస్తున్నట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.