కృష్ణా జిల్లా నూజివీడు మండలం మొర్సపూడి వద్ద అక్రమ మద్యాన్ని నందిగామ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి హనుమాన్ జంక్షన్‌కు తీసుకొస్తున్న 456 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ నుంచి అక్రమంగా తెచ్చిన మద్యం పట్టివేత - కృష్ణా జిల్లా నేర వార్తలు
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడం వల్ల మందుబాబులు అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ నుంచి మద్యం కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. కృష్ణా జిల్లా మొర్సపూడిలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత