విజయవాడ నగరంలోని గుణదల మైత్రినగర్‌లో ఉన్న మంచినీటి ట్యాంకు వద్ద కొందరు వ్యక్తులు పేకాట దందా కొనసాగిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు.. ట్యాంకు రక్షణ గోడ దూకి లోపలికి వచ్చి పేకాడడం, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పోలీసులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నగర శివార్లలో పేట్రేగిపోతున్న పేకాట రాయుళ్లు - విజయవాడ నేటి వార్తలు
విజయవాడలో పేకాట రాయుళ్లు పేట్రేగుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఆడుతూ స్థానికులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని శివారు ప్రాంతాల కాలనీ వాసులు కోరుతున్నారు.
నగర శివార్లలో పేట్రేగిపోతున్న పేకాట రాయుళ్లు