విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ శివార్లలో కొందరు యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన యువకులు... గంజాయి సేవిస్తూ దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కత్తులతో బెదిరిస్తున్నారని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి వీరిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విజయవాడ శివార్లలో గుప్పుమంటున్న గంజాయి - విజయవాడ నేటి వార్తలు
విజయవాడ నగర శివార్లలో గంజాయి గుప్పుమంటోంది. అజిత్ సింగ్ నగర్ లో జన సంచారం లేని ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు గాంజాను సేవిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన స్థానికులపై దాడులకు దిగుతూ బీభత్సం సృష్టిస్తున్నారు.

గంజాయి సేవనానికి అడ్డాగా మారిన విజయవాడలోని అజిత్సింగ్ నగర్