ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రిపుల్ ​ఐటీ... సమస్యల్లో మేటీ - రాష్ట్రంలో ట్రిబుల్ ఐటీ సమస్యలు

రాష్ట్రం ట్రిపుల్ ​ఐటీ కళాశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వసతుల్లేమి, అధ్యాపకుల కొరతతో విద్యార్థులు సతమతమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో భవనాలు ప్రారంభించినా ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్ధితి. రుసుముల చెల్లించలేని విద్యార్థులు పట్టాలు తీసుకోవట్లేదు. సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయోనని ఎదురుచూస్తున్నారు.

సమస్యల్లో చిక్కుకున్న ట్రిబుల్ ఐటీ సంస్థలు

By

Published : Sep 18, 2019, 11:07 AM IST

గ్రామీణ పేద విద్యార్థులకు పదో తరగతి తర్వాత ఇంజినీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినవే ట్రిపుల్ ​ఐటీలు. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విద్యాలయం ఆధ్వర్యంలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో ఇవి నడుస్తున్నాయి. ఏటా ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఆర్థికంగా బలహీన వర్గాల కోటా కింద మరో 10 శాతం సీట్ల పెంచారు. కానీ ప్రాంగణ నియామకాలు, నాణ్యమైన బోధన విషయంలో రాష్ట్ర విద్యా సంస్థలతో పోల్చితే కొంత మెరుగ్గా ఉన్నా ఉద్దేశ సాధనలో వెనుకబడుతున్నాయీ సరస్వతి నిలయాలు.


వీటిని ఐఐటీల స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్నప్పటికీ అటుగా అడుగులు పడటం లేదు. బోధన రుసుములు, మెస్‌చార్జీలు చెల్లించలేక దాదాపు 2 వేల 500 మంది విద్యార్థులు పట్టాలు తీసుకోలేదు. శాశ్వత అధ్యాపకుల కొరత వేధిస్తోంది. నూజివీడు, ఇడుపులపాయ సంస్థలు ఏర్పాటు చేసి 10 ఏళ్లు గడిచినా యూజీసీ గుర్తింపే దక్కలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఒంగోలు, ప్రకాశం,,శ్రీకాకుళం సంస్థల భవనాల నిర్మాణాల ఇప్పటికీ పూర్తి కాలేదు.


ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత అధ్యాపకులు 15 శాతమే ఉన్నారు. ఉత్తీర్ణత 90 శాతం ఉంది. విద్యార్థులపై ఏటా రెండున్నర కోట్ల రూపాయలు రుసుముల భారం పడుతోంది. ఆరేళ్లపాటు చదివిన తర్వాత చివరి ఏడాది రుసుములు చెల్లించలేక కొందరు పట్టాలు తీసుకోవడం లేదు. ఒక్క నూజివీడు ట్రిపుల్ఐటీలోనే విద్యార్థులు చెల్లించాల్సిన రుసుములు 12 కోట్లు వరకు ఉన్నాయి. ఇడుపులపాయలోని వారు 6 వేలు ఉండగా ఒంగోలు విద్యార్థులు 3 వేలు కలిపి 9 వేల మందికి గదులు సరిపోవడం లేదు. నలుగురు ఉండే గదుల్లో ఆరుగుర్ని ఉంచుతున్నారు. మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యలతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ట్రిపుల్ ఐటీల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి.

ట్రిపుల్ ​ఐటీ... సమస్యల్లో మేటీ

ఇదీ చూడండి

24 మందితో తితిదే పాలకమండలి

ABOUT THE AUTHOR

...view details