తొలగించిన 56 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలోని అరబిందో ఫార్మా కంపెనీలో... 15 సంవత్సరాలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారని... ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే రెండు వేతన ఒప్పందాలను కార్మికులు సాధించుకున్నారని పేర్కొన్నారు. మూడవ వేతన ఒప్పందానికి యాజమాన్యాన్ని సంప్రదించిన కార్మికులను...ఎలాంటి ఆధారాలు చూపకుండా తొలగించారని, వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే తమను యాజమాన్యం తొలగించిందని కార్మికులు వాపోయారు.
"తొలగించిన 56 మందిని విధుల్లోకి తీసుకోవాలి" - అరబిందో ఫార్మా కార్మికులు
ఎలాంటి ఆదారాలు చూపకుండా తొలగించిన తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని... అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా చేశారు.
!["తొలగించిన 56 మందిని విధుల్లోకి తీసుకోవాలి"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3953337-1056-3953337-1564159027441.jpg)
అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా
అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా
ఇదీ చదవండి: వయోపరిమితి పెంచాలని కోరుతూ ఆందోళన
TAGGED:
అరబిందో ఫార్మా కార్మికులు