ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిబ్రవరి 5 డెడ్ లైన్..! ఏపీ ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం

ap revenue employees jac : ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ప్రజల్లో తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ap revenue jac
ఏపీ ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ

By

Published : Jan 22, 2023, 5:06 PM IST

ap revenue employees jac : ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యమం : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యమం తప్పదని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐఆర్ పెంచి ఫిట్మెంట్ తగ్గించిన దాఖలాలు లేవన్నారు. కొందరు నాయకులు ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడుతున్నారని.. జనంలో మమ్మల్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు :ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు పెండింగ్ డీఏలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ చెప్పినట్టు బకాయిలు ఇవ్వలేదని.. ఇంకా ఎన్నిరోజులు తాము నిరీక్షించాలని ప్రశ్నించారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. గౌరవంగా తమకు రావాల్సిన బకాయిలనే అడుగుతున్నామని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల్లో మాత్రం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామై ఏమైందని బొప్పరాజు ప్రశ్నించారు.

ఉద్యమం వస్తే ఐక్య పోరాటాలకు సిద్ధం :ఫేషియల్ యాప్ తీసుకొని రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే దానికి డివైజ్ లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ వ్యక్తిగత అంశాలకు భంగం కలిగించే విధంగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగించాలనడం సరైంది కాదన్నారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న దాంట్లో నిజం లేదని.. ఉద్యమం వస్తే అందరూ కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details