తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చిత్తలూరుకు చెందిన వీరేష్ ఈ నెల 11న ప్రమాదంలో గాయపడగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర విభాగంలో వీరేష్‌కు గత పది రోజుల నుంచి వైద్యం అందిస్తున్నారు. గురువారం ఆర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో వీరేష్ ఇబ్బంది పడుతున్నట్లు కిరణ్ గుర్తించారు. ఆక్సిజన్ సిలిండర్ కోసం చూడగా ఖాళీగా ఉంది. వెంటనేసిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వారు మరో సిలిండర్ తీసుకొచ్చేలోపే తన సోదరుడు మృతి చెందినట్లు ఆరోపించాడు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన సోదరుడు మృతి చెందాడని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు.
'ఆక్సిజన్ అయిపోయింది.. ప్రాణం పోయింది...!' - తెలంగాణ నిమ్స్ లో రోగి మృతి వార్తలు
తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ సోదరుడు మరణించాడంటూ పోలీసులకు మృతుడి అన్న ఫిర్యాదు చేశాడు.
నిమ్స్ ఆసుపత్రిలో మృతుడు వీరేష్