Idem Kharma Program in AP: బాదుడే బాదుడే కార్యక్రమంతో.. ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ.. మరో సరికొత్త కార్యక్రమానికి సిద్ధమైంది. వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రభుత్వ అరాచకాలను వారికి వివరించి.. అవగాహన కల్పించేందుకు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టాలని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
Idem Kharma: ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఉద్రిక్తతలు.. ఎక్కడంటే ? - ఏపీలో టీడీపీ నిరసన ప్రదర్శన
Idem Kharma Program: మాజీ ఎమ్మెల్యే బోడేప్రసాద్ తలపెట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతలకు నచ్చచెప్పిన పోలీసులు వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు.
![Idem Kharma: ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఉద్రిక్తతలు.. ఎక్కడంటే ? ఖర్మ రాష్ట్రానికి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16997136-809-16997136-1669100533412.jpg)
చంద్రబాబు పిలుపు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడేప్రసాద్ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రారంభోత్సవం కాని యనమలకుదురు బ్రిడ్జిపై తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని వైసీపీ నేతలు అడ్డుకునే యత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్లను వెంటనే ఇక్కడ నుంచి పంపించి వేయాలంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సర్దిచెప్పారు. పోలీసులు టీడీపీ నేతలను అడుకునే ప్రయత్నం చేయడంతో.. పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ఫ్లెక్సీల రూపంలో టీడీపీ నిరసన ప్రదర్శన కొనసాగిస్తోంది.
ఇవీ చదవండి: