Raging in Indian Business School: హైదరాబాద్లోని శంకర్పల్లిలో ఇండియాన్ బిజినెస్ స్కూల్లో జూనియార్ విద్యార్థిపై కొందరు సీనియార్ విద్యార్థులు దాడి చేసిన ఘటనలో 12మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 1న ఐబీఎస్లో జూనియార్ విద్యార్థిపై కొందరు సీనియార్లు గదిలో బంధించి దాడి చేశారు. దీనికి సంబంధించి వీడియోలు వారం రోజులు తరువాత సోషల్ మీడియాలో వైరల్కాగా స్పందించిన పోలీసులు విద్యార్థులకు సర్దిచెప్పి వారిని పంపించారు. దీనితో చేసింది ఏమీ లేకా బాధిత యువకుడు మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేస్తూ న్యాయం చేయమని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలు చేశారు. దీనితో ఈరోజు 12మంది విద్యార్థులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొందరిపై వేటు తప్పదని స్పష్టం చేసింది.
హైదరాబాద్ ఐబీఎస్లో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులు సస్పెండ్ - ర్యాగింగ్ పై స్పందించిన కేటీఆర్
Raging in Indian Business School: హైదరాబాద్లోని ఇండియాన్ బిజినెస్ స్కూల్లో ర్యాగింగ్ ఘటనకు సంబంధించి 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసినట్లు ఐబీఎస్ యాజమాన్యం తెలిపింది. గదిలో జూనియర్ విద్యార్థిని కొందరు సీనియార్లు బంధించి దాడి చేసిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రాగా దీనిపై స్పంధించిన కేటీఆర్.. ఘటనపై విచారణ జరపమని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరిని సస్పెండ్ చేశారు.
హైదరాబాద్ ఐబీఎస్లో ర్యాగింగ్ కలకలం