ప్రశ్న: చైనా పోకడలు సరిహద్దులో ఏ విధమైనా ప్రభావాన్ని చూపిస్తున్నాయి..?
త్రివిక్రమ్: చైనా చరిత్ర గురించి మాట్లాడితే..సరిహద్దు దేశాలతో తనే సమస్యలు సృష్టించుకుంది. విస్తరణ కాంక్షతో ప్రపంచంలో పెత్తనం సాగించాలనే దురాశ భాగం ఉంది. 1962లో మనదేశ పాలకులు చైనాతో సంబంధాల విషయంలో మెతక వైఖరి అవలభించడంతో అది ముందుకు మన మీదకి చొచ్చుకవచ్చింది. సరిహద్దు ప్రాంతాలలో అపారమైన భూగర్భ సంపద ఉంది. తర్వాత వాళ్లే కనుక్కున్నారు. అక్కడ హిమాలాయాలు, లోయలు,నదులు ఉండంటంకతో గస్తీ తిరగడం కష్టం.1962లో మన సైనికులకు సరైన సౌకర్యాలు లేవు. కొన్ని విపత్కర పరిస్థితులో మనం లక్షల చదరపు మైళ్లున్న విశాల భూభాగాన్ని పోగొట్టుకున్నాం. దానికి తిరిగి పొందడం కష్టంగా ఉంది. 1962-75 సంవత్సరంలో మన సైనికులను చైనా దళాలు హతమార్చాయి. తాగాజా గస్తీ చేస్తున్న మనవాళ్లను చైనా దళాలు నెట్టేసే భూభాగాన్ని అక్రమించుకోవాడానికి కాలుదువ్వింది.
గస్తీ బృందాల మీద దాడులు చేస్తూ..మెల్లమెల్లగా మన స్థావరాలను అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడూ వీటిని పట్టించుకోలేదు.. నిర్ణాయత్మకమైన ఈ ప్రభుత్వం దీనిని పట్టించుకుంటూ..మెతక వైఖరి లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ..సరిహద్దు ప్రాంతాలలో గస్తీ కాయడానికి రవాణాను సులభతరం చేస్తోంది. రహదారులు వేసి భద్రతను పటిష్టం చేస్తుంటే..చైనాకు ఇది నచ్చడంలేదు. వీటిని అడ్డుకోవాడానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది.
నేపాల్ ఎందుకు మనల్ని రెచ్చగొడుతుందంటే..ఇది కూడా చైనా వ్యూహంలోని భాగమే! చైనా క్రూరత్వం చెప్పాలంటే..ప్రపంచదేశాలలో చైనా ఆర్థికంగా నిలదొక్కుకొని ఉంది. కాబట్టి పేద దేశాలకు ఆర్థికంగా సాయం చేస్తుంది. వాళ్లు వాటిని తిరిగి చెల్లించకుండా...ఇలాంటి పన్నాగాలలో ఆ పేద దేశాలను ఇరికించి వాళ్ల పనులు చేయించుకుంటోంది.
తాజాగా..నేపాల్‌లోని ఉపాధ్యాయులకు చైనా జీతాలు ఇస్తూ...వాళ్లు అక్కడే ఏం చెప్తారో తమ దేశంలో కూడా చెప్పేలాగా ఒప్పందం చేసుకున్నారు. భారత్- నేపాల్‌కు శతాబ్దాలనుంచి చరిత్రాత్మకంగా మంచి సంబంధాలును ..చెడగోట్టేలా చేసింది. రాజులను చంపేసి..వాళ్ల స్థానంలో ప్రత్యామ్నయంగా కీలుబొమ్మలాంటి వ్యక్తులను పెట్టి..నేపాల్‌ను తన కనుసన్నల్లో ఉంచుకుంది. ఇప్పుడు మన భూభాగాలు కూడా నేపాల్‌వే అని మొన్ననే బిల్లు తెచ్చారు. ఇదంతా చైనా ఆడిస్తోంది. మనల్ని ఒత్తిడులకు గురిచేసి...లోబర్చుకోవాలని చైనా ఉద్ద్యేశం.
మన చూట్టూ ఉన్న దేశాలతో స్నేహాన్ని పెంచుకుని..అక్కడి తీరప్రాంతాలలో స్థావరాలు ఏర్పరుస్తూ రెచ్చగొడుతుంది. మన శత్రువులను మిత్రులుగా చేసుకుని మనపైకి ఉసిగొల్పుతుంది. ఇప్పటికే పాకిస్థాన్‌ను తన ఆధీనంలో ఉంచుకుంది. మన భారత్ ధీటైనా సమాధానాలు ఇవ్వడంతో దానికి మింగుడుపడటంలేదు. దక్షిణా చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం కాల్పనిక ద్వీపం తయారుచేసి స్థావరాలను ఏర్పరచుకుంది. 100నౌకలు, 70కిపైగ జలంతార్గాములు ఉన్నాయి ఇప్పటికే 2 కిమీ ల ముందుకు వచ్చారని సమాచారం.
మన స్థావరాలను పటిష్టం చేసుకోవాలి. యుద్ధమైతేరాదు..ఒకవేళా వచ్చినా ప్రపంచదేశాల మద్దతు మనకుంది. పర్వాతారోహాల పనికొచ్చే ఆయుధాలు వాడుకోవాలి. రష్యా తటస్థంగా ఉంటుంది. అమెరికా మనకు క్షిపణులు, ఆయుధాలు, జలంతార్గాములు నాశనం చేసే రూబీ హెలికాప్టర్స్ , అత్యాధునిక ఆయుధాలను అందిస్తోంది. ఐరన్‌డోమ్ శత్రుదేశాలనుంచి క్షిపణులు వస్తే...నాశనం చేసే యాంటీ మిస్సైల్ ఒప్పందం 1.5 బిలియన్ డాలర్లతో జరిగింది.