ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా తెదేపా నాయకుడు దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి కళావెంకట్రావు... అవినాష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం చంద్రబాబు, అవినాష్ పై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చారని... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి కళా చెప్పారు. తెదేపాను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి దేవినేని సూచించారు. చంద్రబాబు తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అవినాష్ చెప్పారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.