ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజ్‌భవన్‌ ప్రాంగణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి - ఏపీ రాజ్‌భవన్‌ ప్రాంగణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం

రాజ్‌భవన్‌ ప్రాంగణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేశారు. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 120 లీటర్ల ద్రావణాన్ని రెండు గంటలపాటు పిచికారి చేశారు.

ap-rajbhavan-drone-spraying
ap-rajbhavan-drone-spraying

By

Published : Apr 25, 2020, 7:56 PM IST

రాజ్‌భవన్‌ ప్రాంగణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ

కరోనా నివారణ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విజయవాడలోని రాజ్‌భవన్‌ ప్రాంగణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చేశారు. డ్రోన్‌ సాయంతో రాజ్‌భవన్‌ ఆవరణ మొత్తం సుమారు 120 లీటర్ల ద్రావణాన్ని స్ప్రే చేశారు. రాజ్​భవన్ వైద్య ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు రాజ్ భవన్ ప్రాంగణం అంతటా సుమారు రెండు గంటల పాటు ద్రావణాన్ని పిచికారి చేశారు. విజయవాడలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. రాజ్ భవన్ భద్రతాపరంగా ప్రతిరోజు తగిన రీతిలో ఈ ద్రావకాన్ని పిచికారి చేయించాలని అధికారులు నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details